![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -351 లో.....అమూల్యని విశ్వ ట్రాప్ చేసాడు. అంటే దానికి కారణం నువ్వే ఇప్పుడు.. ఈ రెండు కుటుంబాలు కలవాలంటావని ప్రేమతో ధీరజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా.. మా అన్నయ్య ఏం ప్రేమించడం లేదు.. నీ చెల్లి ప్రేమించమని వెంటపడుతుందని ప్రేమ అంటుంది. అమూల్యతో మాట్లాడాక నీ సంగతి నీ అన్నయ్య సంగతి తేలుస్తానని చెప్పి ధీరజ్ వెళ్ళిపోతాడు. అదంతా తెలిసి భాగ్యం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
మరొకవైపు విశ్వ, అమూల్య వెళ్తుంటే నర్మద ఫాలో అవుతుంది. అమూల్యని విశ్వ గుడికి తీసుకొని వస్తాడు. ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావని అమూల్య అడుగగా.. మీ పెద్ద అన్నయ్యకి మన విషయం తెలిసింది అందుకే పెళ్లి చేసుకుందామని అంటాడు. వద్దని అమూల్య అంటుంది. అప్పుడే నర్మద ఎంట్రీ ఇచ్చి విశ్వ చెంప చెల్లుమనిపిస్తుంది. మా అమూల్యని ట్రాప్ చేస్తావా అని విశ్వపై కోప్పడుతుంది. అప్పుడే ప్రేమ వచ్చి అక్క మా అన్నయ్య పై చెయ్ చేసుకోకుండా మాట్లాడమని నర్మదపై కోప్పడుతుంది. దాంతో నర్మద షాక్ అవుతుంది.
ఆ తర్వాత ధీరజ్, సాగర్ వచ్చి విశ్వపై గొడవకి వెళ్తుంటే చందు వచ్చి ఆపుతాడు. ఒరేయ్ ఆగండి.. ఈ విషయం నాకు ముందే తెలుసు.. అమూల్య ఏదైనా చేసుకుంటుందని ఆగిపోయానని చందు అంటాడు. సీన్ కట్ చేస్తే రామరాజు ముందు అందరు ఉంటారు. ఈ వయసులో నీకు ప్రేమ ఏంటే అని అమూల్యని వేదవతి తిడుతుంది. ఏదైనా పాపం చేస్తే ఇలాంటి పిల్లలు పుడతారట.. నేను ఏ పాపం చేశానని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |